కడప జిల్లా చాపాడు మండలం లక్ష్మీపేట రోడ్డు వద్ద నీటి సరఫరా పైపులైన్ లీక్ కావడంతో నీరు వృథాగా పోతోంది. బ్రహ్మంసాగర్ జలాశయం నుంచి రాయలసీమ థర్మల్ తాప విద్యుత్తు కేంద్రానికి(RTPP pipeline) నీటిని సరఫరా చేసే పైపులైన్‌కు లక్ష్మీపేట వద్ద ఉన్న ఎయిర్‌వాల్వ్ లీకేజీ(rtpp pipeline leakage at lakshmipeta ) అవుతోంది. దీంతో పెద్ద ఎత్తున నీరు వృథాగాపోతోంది. వాల్వ్ నుంచి పెద్ద శబ్దంతో దాదాపు 15 అడుగుల ఎత్తుతో నీరు విరజిమ్ముతోంది.
ఇదీ చదవండి..
UPSC TOPPER: నాలుగుసార్లు విఫలమైనా.. ఐదోసారి అదరగొట్టేశాడు.!