ETV Bharat / state

'రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని రక్షించండి' - రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం వార్తలు

కడప జిల్లాలో ఉన్న రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని రక్షించేందుకు ప్రభుత్వం దృష్టికి సమస్య తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని.. అఖిలపక్ష, ప్రజా సంఘాల నేతలు జిల్లా కలెక్టర్​ను కలిసి విజ్ఞప్తి చేశారు. రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని వెంటనే ప్రారంభించాలని.. ఉద్యోగులకు భద్రత కల్పించాలని.. సంస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.

rtpp issue in cadapa district
rtpp issue in cadapa district
author img

By

Published : Jul 22, 2020, 12:34 AM IST

రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని రక్షించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించాలని అఖిలపక్షనేతలు జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందించారు. కడప జిల్లాలో 1988లో రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటయ్యిందని తెలియజేశారు. గత 32 ఏళ్లుగా ఆర్టీపీపీ ఉద్యోగులు చేస్తున్న కృషి ఫలితంగా.. మంచి ఫలితాలు సాధించి దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని అన్నారు. జెన్​కో యాజమాన్యం ప్రస్తుతం ఉన్న ఆరు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసిందన్నారు. దీని కారణంగా అటు ఉద్యోగులు, ఇటు ప్రజల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతుందని కలెక్టర్ కు వివరించారు.

ఆర్టీపీపీని నమ్ముకుని వేలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని తెలిపారు. కరువు కాటకాలకు, వెనకబడిన రాయలసీమ ప్రాంతంలో ఆర్టీపీపీని ఆదుకోవాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. ఆర్టీపీపీలో ఉన్న అన్ని యూనిట్లలో 1650 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని వెంటనే ప్రారంభించాలని.. ఉద్యోగులకు భద్రత కల్పించాలని కోరారు. జిల్లా కలెక్టర్ స్పందించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.

ఇదీ చదవండి: ఎలుక సాహసం.. తల్లి ప్రేమకు నిదర్శనం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.