ETV Bharat / state

రాష్ట్రంలో రహదారి ప్రాజెక్టులకు రూ.2,200 కోట్లు - రహదారి ప్రాజెక్టులకు రూ.2,200 కోట్ల వార్తలు

రాష్ట్రంలో 52 రహదారుల నిర్మాణం, మరమ్మతులు, విస్తరణ పనుల కోసం కేంద్ర రహదారి రవాణాశాఖ 2021-22 బడ్జెట్‌లో రూ.2,200 కోట్లు కేటాయించింది.

Rs 2,200 crore for road projects
రాష్ట్రంలో రహదారి ప్రాజెక్టులకు రూ.2,200 కోట్లు
author img

By

Published : Feb 19, 2021, 7:32 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో 52 రహదారుల నిర్మాణం, మరమ్మతులు, విస్తరణ పనుల కోసం కేంద్ర రహదారి రవాణాశాఖ 2021-22 బడ్జెట్‌లో రూ.2,200 కోట్లు కేటాయించింది. పామర్రు-ఆకివీడు సెక్షన్‌లో 64 కిలోమీటర్ల మేర ఎన్‌హెచ్‌ 165 విస్తరణ కోసం గరిష్ఠంగా రూ.200 కోట్లు కేటాయించారు. ఈ మార్గాన్ని పూర్తి ఈపీసీ విధానంలో చేపట్టనున్నారు. కదిరి పట్టణానికి బైపాస్‌, రాయపుర్‌-విశాఖపట్నం మధ్య ఎన్‌హెచ్‌-26 విస్తరణ, మడకశిర నుంచి కర్ణాటక సరిహద్దు వరకు ఉన్న రహదారి విస్తరణ పనులకు మాత్రమే రూ.100 కోట్లు కేటాయించారు.

మిగిలిన పనులన్నింటికీ రూ.100 కోట్లలోపే కేటాయింపులు జరిగాయి. విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టే ఆరు ప్రాజెక్టుల కోసం రూ.998 కోట్లు కేటాయించారు. ఇందులో కొయ్యూరు-ఛప్రతిపాలెం మధ్య 45 కిలోమీటర్ల విస్తరణకోసం రూ.206 కోట్లు, ఛప్రతిపాలెం నుంచి లంబసింగి వరకూ 40 కిలోమీటర్ల విస్తరణ కోసం రూ.183 కోట్లు, లంబసింగి-పాడేరు మధ్య 48 కిలోమీటర్ల విస్తరణకోసం రూ.213 కోట్లు, పాడేరు-గోండిగూడ సెక్షన్‌ విస్తరణకోసం రూ.127 కోట్లు, గోండిగూడ-అరకు సెక్షన్‌ విస్తరణకు రూ.171 కోట్లు కేటాయించారు.

ఇవీ చూడండి :

రియల్ హీరోలకు పది రెట్ల నజరానా పెంచుతున్నట్లు ప్రకటించిన సీఎం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.