రహదారి భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమం 31వ రహదారి భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమం కడప ఆర్టీసీ గ్యారజ్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఓఎస్డీ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్టీసీపై ఇప్పటికీ ప్రజలకు నమ్మకముందన్నారు. చాలా మంది డ్రైవర్లు సెల్ఫోన్ మాట్లాడుతూ, బస్సులు నడుపుతున్నారనీ... ఇది పెద్ద తప్పిదమని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ప్రమాదాల వల్ల 600 మంది మృతి చెందినట్లు వెల్లడించారు. ప్రమాదాలు నివారిస్తే ఆర్టీసీ మరింత ముందుకు వెళ్తుందన్నారు. విధుల్లోకి చేరి ఒక్క రోడ్డు ప్రమాదం చేయకుండా ఉన్న ఆర్టీసీ డ్రైవర్లను మెచ్చుకుంటూ, బహుమతులు అందజేశారు. వీరిని మిగతా డ్రైవర్లు ఆదర్శవంతంగా తీసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి:
గణతంత్ర వేడుకలు నిర్వహణకు విద్యార్థుల చేత వెట్టిచాకిరీ