కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం రెడ్డిపల్లి చెరువు కట్టపై అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తాడిపత్రి నుంచి చెన్నైకి ఎర్రగడ్డలను తీసుకు వెళుతున్న మినీ లారీనీ, తిరుపతి నుంచి కడపకు వెళుతున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మినీ లారీలో డ్రైవర్ పక్కన ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మృతులు తాడిపత్రి రైతులు అయి ఉండొచ్చని.. పోలీసులు భావించారు. ఢీ కొట్టిన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. మృతదేహాలను వెలికి తీసి పోస్టు మార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: