కడపజిల్లా యర్రగుంట్ల మండలం పోట్లదుర్తి పెన్నా నది బ్రిడ్జ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న భార్గవి (35) అనే మహిళ.. జారిపడింది. వెంటనే ఆమె తలపై నుంచి లారీ వెళ్లింది. అక్కడిక్కడే మహిళ మృతి చెందింది. ఈ ఘటనతో ట్రాఫిక్ రెండు కిలోమిటర్ల మేర నిలిచిపోయింది.
భార్గవి భర్త వంశీనాధ్ రెడ్డి ఆర్టీపీపీలో ఉద్యోగి. 8 నెలలు క్రితమే వారికి వివాహమైంది. మృతురాలి కుటుంబ సభ్యులు ప్రొద్దుటూరు మోడంపల్లెలో నివాసం ఉంటున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలంలో ట్రాఫిక్ రాకపోకలను క్రమబద్ధీకరించారు.
ఇదీ చదవండి: