కడపజిల్లా సిద్దవటం మండలంలోని ఎస్కేఆర్ నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-ద్విచక్రవాహనం ఢీ కొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండగా.. కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో సిద్దవటం మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన కాడే మంగమ్మ గారి ప్రతాప్(35), బద్వేలు మండలంలోని జాండ్లవరానికి చెందిన నవనీశ్వర్(24).. అక్కడికక్కడే మృతి చెందారు. మిట్టపల్లి గ్రామానికి చెందిన కాడే వెంకటరమణను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ఇదీ చదవండి: