అగ్రవర్ణ పేదలు జగన్ ప్రభుత్వంలో ఉద్యోగాలు కోల్పోతున్నారని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదల కోసం ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేస్తే...ప్రభుత్వం మాత్రం విద్యా సంస్థల్లో మాత్రమే అమలు చేస్తోందన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో ఈ రిజర్వేషన్లను కచ్ఛితంగా అమలు చేసి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అగ్రవర్ణ పేదలపై నిర్లక్ష్యం ఎందుకని జగన్ను ప్రశ్నించారు. గ్రామ వాలంటీర్ల పోస్టులు భర్తీ అయిపోయాయి. కనీసం గ్రామ సచివాలయం పోస్టుల్లోనైనా పదిశాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ తరపున హైకోర్టులో పిటిషన్ వేశామన్నారు. ఈ లోగా గవర్నర్ను కలిసి వినిత పత్రం అందిస్తామన్నారు.
ఇదీచదవండి