కడప జిల్లా రైల్వే కోడూరు మండలం రాఘవరాజాపురం సమీపంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను రైల్వేకోడూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.1 లక్ష 50వేల విలువైన ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. డీఎస్పీ శివభాస్కర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు దుండగులను అదుపులోకి తీసుకున్నారు. పది మంది నిందితుల్లో ఏడుగురు పరారవ్వగా...ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఎవరైనా ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇదీ చదవండి: