కడప జిల్లా రోళ్లమడుగు అటవీ ప్రాంతంలో 8 మంది ఎర్రచందనం కూలీలను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి తెలిపారు. స్మగ్లర్లు చూపే డబ్బు ఆశకు కూలీలు బలవుతున్నారని డీఎస్పీ అన్నారు. కర్నూలు జిల్లా గోసుపాడు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన వీరిని.. అనిల్ అనే వ్యక్తి ఎర్రచందనం కొట్టడానికి తీసుకువచ్చినట్లు చెప్పారు. నిందితులను రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: