కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమంగా రవాణ చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బొట్టుమీదపల్లి వంతెన వద్ద దుంగలను తరలిస్తుండగా పట్టుకున్నారు. నిందితుల్లో ఇద్దరు గతంలో అటవీశాఖలో పొరుగు సేవల ఉద్యోగులుగా పనిచేసిన సుబ్రమణ్యం, రవి స్మగ్లర్లకు సహకరించినట్లు ఎస్పీ తెలిపారు. వారి నుంచి 600 కేజీల బరువున్న 20 ఎర్ర చందనం దుంగలు, కారు, ఆటో, బైక్ స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఎర్రచందనం అక్రమ రవాణపై పోలీసుశాఖ కఠినంగా వ్యవహరిస్తోందని.. ప్రజలకు సమాచారం తెలిస్తే పోలీసులకు చేరవేయాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. వరుసగా స్మగ్లింగ్ చేసే స్మగ్లర్లపై పీడీ యాక్టులు నమోదు చేస్తున్నామని తెలిపారు.
ఇదీచదవండి
సీబీఐ దర్యాప్తు జరపకపోతే సుప్రీం కోర్టుకు వెళ్తా: ఏబీ వెంకటేశ్వరరావు