ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలు స్వాధీనం

కడప జిల్లా రైల్వేకోడూరు బాలుపల్లె చెక్​పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న 20ఎర్రచందనం దుంగలను... అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నించగా ఒక వ్యక్తి పరారయ్యాడని... మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని డీవైఆర్​ఓ శ్రీనివాస్ తెలిపారు.

red sandal seazed in railway kodur at kadapa district
అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం స్వాధీనం
author img

By

Published : Jun 21, 2020, 6:33 PM IST

కడప జిల్లా బాలుపల్లె చెక్​పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను... అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 18వ తేదీన చెక్​పోస్టు వద్ద వాహనం అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేశామని డీవైఆర్​ఓ శ్రీనివాస్ తెలిపారు. ఈ క్రమంలో వాహనంలోని ఇద్దరు వ్యక్తులను పట్టుకునేందుకు ప్రయత్నించగా ఒక వ్యక్తి పారిపోయాడని..., హర్యానా రాష్ట్రానికి చెందిన రాజ్​పాల్​ని అదుపులోకి తీసుకున్నామని ఆయన తెలిపారు. వాహనంతో పాటు రూ.లక్షా 60 వేలు విలువచేసే 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

ఇదీ చదవండి: భారీగా నిషేధిత గుట్కా స్వాధీనం చేసుకున్న స్పెషల్​ బ్రాంచ్​ పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.