12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. ఇద్దరి అరెస్టు - red sadel seezed in obulavari palli kadapa district
కడప జిల్లా ఓబులవారిపల్లి మండలం గాదెల అటవీ ప్రాంతంలో అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్న ఇద్దరిని అటవీశాఖాధికారులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి లక్ష రూపాయలు విలువ చేసే 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 15 మంది స్మగ్లింగ్‌కు పాల్పడగా.. మిగిలినవారు పరారయ్యారని అధికారులు తెలిపారు. వీరిని త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.
Intro:కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం గాదేల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్వాధీనం వాటి వివరాలు.
Body:ఓబులవారిపల్లె మండలం గాదేల అటవీ ప్రాంతంలో రైల్వేకోడూరు అటవీశాఖ అధికారులు కూంబింగ్ చేస్తుండగా 15 మంది ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తున్న స్మగ్లర్లు అటవీశాఖ అధికారులకు తారసపడ్డారు. వారిని వెంబడించి పట్టుకునేందుకు ప్రయత్నించగా వారిలో ఇద్దరు దొరికారని మిగతావారు పారిపోయారని అధికారులు తెలిపారు. వారి వద్ద నుండి లక్ష రూపాయలు విలువ చేసే 12 ఎర్రచందనం దుంగలను తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.