ETV Bharat / state

కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని ఆర్డీవోకు వినతి - appeals to rdo at kadap district

జీవనం కష్టంగా మారిన వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మిక కుటుంబాలు ఆదుకోవాలని ఏఐటీయూసీ జిల్లా నాయకుడు ఎంఎస్ రాయుడు కోరారు. ఈ మేరకు రాజంపేట ఆర్డీవో ధర్మ చంద్రరెడ్డికి వినతి పత్రం అందజేశారు.

rdo appeals to  at rajampeta
ఆర్డీవో కి వినతి పత్రం అందజేస్తున్న నాయకులు
author img

By

Published : May 11, 2020, 3:40 PM IST

కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ కడప జిల్లా రాజంపేటలో ఆర్డీవో ధర్మచంద్రరెడ్డికి ఏఐటీయూసీ జిల్లా నాయకుడు ఎంఎస్ రాయుడు వినతిపత్రం అందజేశారు. ప్రైవేట్ రంగాల్లో పని చేస్తున్న కార్మికులను కరోనా కారణంగా తొలగించే ప్రక్రియను విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధి కోల్పోయిన కార్మిక రంగానికి ఊతమివ్వాలని, ఉపాధి పథకం కింద కార్మికులకు కూలీల ధరలు పెంచాలని కోరారు. వలస కార్మికులకు పది వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడంతోపాటు వారి స్వస్థలాలకు చేర్చాలన్నారు.

ఇదీ చూడండి: ఆరేళ్ల పగ: బావమరిదిని చంపిన బావ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.