ETV Bharat / state

rare hawks: కడప గడపలో అరుదైన గద్దలు

గ్రామీణ ప్రాంతాల్లో గతంలో గద్దలు, డేగలు విరివిగా కనిపించేవి. వివిధ కారణాల వల్ల ప్రస్తుతం వాటి సంఖ్య తగ్గిపోతోంది. అటవీ ప్రాంతాల్లో అప్పుడప్పుడు దర్శనమిస్తున్నాయి. కొన్ని రకాల గద్దలు అంతరించిపోయే పరిస్థితిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటి ఉనికిని తెలుసుకోవడానికి రాజంపేట సామాజిక అటవీశాఖ క్షేత్రాధికారి షేక్‌ మహమ్మద్‌ హయాత్‌ కొంతకాలం కిందట పరిశోధన ప్రారంభించారు.

Rare hawks
అరుదైన గద్దలు
author img

By

Published : Jun 11, 2021, 3:22 PM IST

కడప జిల్లాలోని కడప, సిద్దవటం, చింతకొమ్మదిన్నె, ఖాజీపేట, గువ్వలచెరువు, గాలివీడు, అట్లూరు, పోరుమామిళ్ల, వల్లూరుతోపాటు మరికొన్ని మండలాల్లో తిరిగి అత్యంత అరుదైన గద్దలను గుర్తించారు. అంతరించిపోతున్న గద్ద ఉనికిని సైతం కనుగొని కెమెరాలో బంధించారు.

hayath
మహమ్మద్‌ హయాత్‌

ఉడతల గద్దను చింతకొమ్మదిన్నె మండలంలోని మద్దిమడుగు అటవీ ప్రాంతంలో గుర్తించారు. కుందేటి సాలవ(బొనెల్లి తీగలు) పక్షిని సిద్దవటం, గాలివీడు అటవీ ప్రాంతాల్లో, అత్యంత అరుదైన పక్షి జాతిలో ఉన్న జుట్టు బైరి గద్దను సిద్దవటం, పోరుమామిళ్ల కుంటలు, అడవుల్లో గుర్తించారు. అడవి నల్లగద్దను సిద్దవటం రేంజిలోని కొండూరు అడవులు, గువ్వలచెరువు ఘాట్‌లో, పాముల గద్దను పోరుమామిళ్ల ప్రాంతంలో, చిన్న నల్లగద్ద, జాలే, తెల్లతల పిల్లి, వర్ణపు గద్ద, పిల్లి గద్దలను కడప, కొప్పర్తి, మద్దిమడుగు, ఖాజీపేట ప్రాంతాల్లో గుర్తించి కెమెరాలో బంధించినట్లు మహమ్మద్‌ హయాత్‌ తెలిపారు.

ఇదీ చదవండి: బంగాళాఖాతంలో 24 గంటల్లో అల్పపీడనం.. నైరుతి మరింత విస్తరించే అవకాశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.