ETV Bharat / state

బ్యాంకర్ల తీరుపై.. పెద్దపసుపుల రైతుల ఆందోళన

శనగ పంటపై రుణాలు ఇచ్చి... ఏడాది దాటినా తిరిగి చెల్లించలేదన్న కారణంగా... కడప జిల్లా పెద్దపసుపుల గ్రామంలో బ్యాంకర్లు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. సరుకు తీసుకెళ్లేందుకు వెళ్లిన వారి తీరుపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.

కడప జిల్లాలో రైతులు ఆందోళన
author img

By

Published : Jun 3, 2019, 6:23 PM IST

కడప జిల్లాలో రైతులు ఆందోళన

కడప జిల్లా పెద్ద ముడియం మండలం పెద్దపసుపుల గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం పెద్దపసుపుల గ్రామంలోని ఓ గోదాము వద్ద .....బ్యాంకర్లు సరకును తీసుకెళ్లేందుకు వచ్చారు. శనగ పంట పైన రుణాలు ఇచ్చి.. ఏడాది దాటినా తిరిగి చెల్లించలేదని అందుకే జప్తు చేస్తున్నామన్నారు. అందుకు రైతులు ససేమిరా ఒప్పుకోలేదు. అక్కడకు చేరుకున్న జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. బ్యాంకర్లతో మాట్లాడి కొంత గడువుని కోరారు. కనీసం మూడు నెలలైనా గడువు ఇస్తే రైతులు రుణాలు చెల్లించే అవకాశం ఉందని చెప్పడంతో వెనుదిరిగారు.

ఇవి చదవండి...సత్యదేవుని సన్నిధానం... ఇకపై మరింత సుందరం

Intro:Ap_Nlr_01_03_Jonnavada_Kamakshithai_Kalyanam_Kiran_Av_C1

నెల్లూరు జిల్లా జొన్నవాడలో వెలసియున్న శ్రీ కామాక్షితాయి అమ్మవారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేదపండితులు కల్యాణాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పట్టు వస్త్రాలు, సర్వాభరణాలతో సుందరంగా ముస్తాబైన శ్రీ మల్లికార్జున స్వామి, కామాక్షితాయి అమ్మవార్లను కల్యాణ వేదిక వద్దకు చేర్చారు. అక్కడ వేద మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల మద్య స్వామి వారి కల్యాణం కమనీయంగా జరిగింది. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కళ్యాణ అనంతరం స్వామి వారి తలంబ్రాలు తీసుకునేందుకు భక్తులు పోటీపడ్డారు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.