కడప జిల్లా రైల్వేకోడూరులోని రైల్వే స్టేషన్‌ను గుంతకల్లు డివిజనల్ రైల్వే మేనేజర్ అలోక్ తివారి, ఏడీఆర్ఎం సూర్యనారాయణ సుమారు గంటపాటు రైల్వేస్టేషన్ పరిశీలించారు. రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులపై సంబంధిత అధికారులతో చర్చించారు. రైల్వే అండర్ బ్రిడ్జ్ ఏర్పాటుకు నిధులు వచ్చాయని... 2021 జనవరిలో టెండర్లు పిలిచి డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేస్తామని తెలిపారు.
స్థానిక రైల్వే స్టేషన్లో పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. రైల్వేకోడూరు నుంచి మంగంపేట బెరైటీస్ ఖనిజం రవాణాపై తగిన ఏర్పాట్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రైల్వేస్టేషన్‌కు మద్యం సేవించి వస్తే వారిపై కేసులు నమోదు చేయాలని రైల్వే పోలీసులను ఆదేశించారు.
ఇదీ చూడండి