ETV Bharat / state

రాయచోటి ఏరియా ఆసుపత్రి నూతన కమిటీ ప్రమాణస్వీకారం - కడప జిల్లా ఏరియా ఆసుపత్రి వార్తలు

రాయచోటి ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి నూతన కమిటీ ఏర్పాటైంది. ఈ మేరకు కమిటీ ఛైర్మన్​గా ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి బుధవారం ప్రమాణం చేశారు. ఆసుపత్రి సమస్యలపై దృష్టి సారిస్తామన్నారు.

Raikhoti Area Hospital New Committee sworn oath in Sworn oath

author img

By

Published : Jun 4, 2020, 12:34 PM IST

కడప జిల్లా రాయచోటి ఏరియా ఆసుపత్రికి నూతన అభివృద్ధి కమిటీ ఏర్పాటైంది. బుధవారం ఆసుపత్రి ఆవరణంలో కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గా ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆసుపత్రి అభివృద్ధికి మరింత కృషి చేస్తామని ఆయన తెలిపారు.

చుట్టుపక్కల 9 మండలాల ప్రజలకు దేవాలయంలా... రాయచోటి ప్రభుత్వాసుపత్రి కొనసాగుతోందన్నారు. 50 పడకల ఆసుపత్రి స్థాయి నుంచి 100 పడకల ఆసుపత్రి స్థాయికి పెంచిన సీఎం జగన్​కు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రూ.23 కోట్ల నిధులతో చేపట్టిన భవనాల నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

నిధులు దుర్వినియోగం కాకుండా పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. వైద్యాధికారులు, సిబ్బంది రాత్రి వేళల్లో రోగులకు అందుబాటులో ఉండి... సేవలు అందించాలని ఆయన ఆదేశించారు.

ఎంపీ మిథున్ రెడ్డి, తాను ఆసుపత్రి బయట రోగులకు, పేద ప్రజలకు సొంత డబ్బులతో ఉచిత భోజన వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఒక వారంలో కోవిడ్- 19 ల్యాబ్​ను రాయచోటిలోనే ఏర్పాటు చేస్తామన్నారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాల, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని శ్రీకాంత్ రెడ్డి సూచించారు.

ఆసుపత్రిలో ఈసీజీ కేంద్రం ఏర్పాటుకు శ్రీ కాంత్ రెడ్డి రూ. 50 వేలు విరాళం ప్రకటించారు. గుండె జబ్బులను గుర్తించేందుకు అవసరమైన పరికరాల కొనుగోలుకు ఈ నిధులు వెచ్చించాలన్నారు.

ఇదీ చదవండి: మర్మాంగాన్ని కోసి భర్తను చంపిన భార్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.