కడప జిల్లా కొండాపురం పరిధిలోని ఈశ్వరమ్మ కాలనీలో కొండచిలువ కలకలం సృష్టించింది. సుమారు 12 అడుగుల పొడవున్న పాము.. కాలనీలోకి రావడం వల్ల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఉదయం కాలనీలోకి చొరబడి రెండు కోళ్లను మింగేసింది. గమనించిన స్థానికులు హతమార్చారు. కొద్ది రోజుల క్రితం పది అడుగుల కొండచిలువ ఇదే కాలనీలోకి రాగా... అప్పుడూ కూడా హతమార్చారు. తరచుగా కొండచిలువలు వస్తుండడంపై ఆందోళన చెందుతున్నారు.
భారీగా కురిసిన వర్షాలకు గండికోట జలాశయం పూర్తిగా నిండటం వల్ల ప్రాజెక్టు వెనుక జలాలు స్థానిక కాలనీలో చేరాయి. అప్పటినుంచి పాముల బెడద ఎక్కువగా ఉంటోందని స్థానికులు పేర్కొన్నారు. ఇళ్ల మధ్యలోకి తరచు ఇలాంటి కావడం వల్ల ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నామని వాళ్లు వాపోతున్నారు.
ఇదీ చూడండి:
తక్కెళ్లపాడు చెత్త కుప్పలో పేలుడు..పారిశుద్ధ్య కార్మికులకు గాయాలు