నివాసాల మధ్య కరోనా బాధితుల వార్డును ఏర్పాటు చేయడం మానుకోవాలంటూ కడపలో ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. కడప మహిళా సాధికారత శిక్షణ కేంద్రం ప్రాంగణంలో కరోనా వార్డును ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నట్లు తెలియడంపై ఆందోళన వ్యక్తం చేశారు. నివాసాల మధ్య ఇలాంటి వార్డులు ఏర్పాటు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. అధికారులు వెంటనే వార్డును తొలగించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: