కడప జిల్లా ప్రొద్దుటూరులో మాంసం విక్రేతలు, మున్సిపల్ సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది. మాంసం విక్రయాలు జరుపుతున్నారని పురపాలిక సిబ్బంది దుకాణాల్లో తనిఖీలు చేశారు. ప్రొద్దుటూరు రెడ్‌జోన్ కావడం వల్ల మాంసం విక్రయించకూడదని మున్సిపల్ సిబ్బంది విక్రేతలు తెలిపారు.
కొందరు వర్తకులు మాంసం విక్రయిస్తుండటంతో మున్సిపల్ సిబ్బంది.. మాంసం స్వాధీనం చేసుకున్నారు. సిబ్బంది చర్యతో ఆగ్రహించిన విక్రేతలు పురపాలిక సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న అసిస్టెంట్ కమిషనర్ గంగా ప్రసాద్ అక్కడికి చేరుకుని సర్దిచెప్పడంతో వివాదం ముగిసింది. స్వాధీనం చేసుకున్న మాంసాన్ని విక్రేతలకు తిరిగి ఇచ్చేశారు.
ఇదీ చదవండి : చిన్నారులపై విషవాయు ప్రభావం