కడప జిల్లా ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్, మట్కా జూదం జోరుగా సాగుతున్నాయని.. అందుకు పోలీసులు పరోక్షంగా సహకారం అందిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆరోపించారు. పోలీసులు అనుమతులు ఇస్తున్న కారణంగానే.. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్నారు. ఇటీవల 30 మంది క్రికెట్ బుకీలను పోలీసులు అరెస్ట్ చేసి దాదాపు 30 కోట్లతో పాటు వారి బ్యాంకు లావాదేవీలను జప్తు చేశారని తెలిపారు.
కానీ... వాటికి పరోక్షంగా అనుమతించిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టం ఎవరికైనా ఒక్కటే అనే విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ప్రొద్దుటూరులో అవినీతి ఎక్కువైపోయిందని.. ఈ పరిస్థితిని ప్రభుత్వ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ఈ అక్రమాలపై జిల్లా స్థాయి అధికారులు నిఘా ఉంచాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: