కరోనా వ్యాధితో బాధపడుతున్న రోగికి ఓ కానిస్టేబుల్ ప్లాస్మా దానం చేసి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు. పోలీసులలో కఠినత్వమే కాదు మానవత్వం కూడా ఉంటుందని ఆయన నిరూపించారు. కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన కానిస్టేబుల్ జయరామిరెడ్డి ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రభుత్వాస్పత్రిలో కరోనా వ్యాధితో బాధపడుతున్న రోగికి ప్లాస్మా దానం చేసి ప్రాణం పోశారు. ఇతని ఉదారతను గుర్తించిన వైద్య ఆరోగ్య అధికారులు, సిబ్బంది అభినందించారు.

ఇవీ చదవండి