Venkata Sanjana Kidnap case: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిస్సింగ్ కేసులను పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. ఒక్కొక్కటిగా ఛేదిస్తున్నారు. ఈనెల 14వ తేదీన కడప జిల్లా బద్వేలు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని వెంకట సంజన అదృశ్యమైందని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసిన పోలీసులు.. వెంకట సంజన అపహరణకు గురైనట్లు గుర్తించారు. బద్వేలు నుంచి నెల్లూరు ఆ తర్వాత విజయవాడకు ఓ మహిళ అపహరించి తీసుకెళ్లినట్లు సీసీ ఫుటేజీల ద్వారా గుర్తించి పోలీసులు కేసును పురోగతి సాధించారు. విజయవాడలో మహిళ చర నుంచి విద్యార్థిని కాపాడి మహిళలతో పాటు విద్యార్థిని సంజనను ప్రత్యేక వాహనంలో బద్వేలుకు సురక్షితంగా తీసుకొచ్చారు. ఈ కేసులో మరికొందరు మహిళల ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవీ చదవండి: