కడప జిల్లా రాజంపేట అటవీ డివిజన్ పరిధిలోని రోళ్లమడుగు ప్రాంతంలో అక్రమంగా రవాణా చేస్తున్న 15 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. డిఎఫ్ఓ కి అందిన సమాచారంతో రోళ్లమడుగు ప్రాంతంలో అధికారులు కూంబింగ్ నిర్వహించారు. అప్పటికే ఎర్రచందనం చెట్లను నరికి దుంగలుగా తయారుచేసి రవాణాకు సిద్ధంగా ఉంచారని... తాము మూకుమ్మడిగా దాడిచేయగా ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారని, మరో నలుగురు వ్యక్తులు పరారయ్యారని రాజంపేట రేంజర్ శ్రీనివాసులు తెలిపారు. పట్టుబడిన వారిలో ఒకరు రాయచోటికి చెందిన వారు కాగా మిగతా వ్యక్తులు అనంతపురానికి చెందిన వారని తెలిపారు. పట్టుకున్న దుంగల విలువ 1,87,533వేల రూపాయలు ఉందని రేంజర్ వివరించారు.
ఇది చూడండి: తీరమంతా ముంపులోనే...లంక గ్రామాలన్నీ నీటిలోనే