ETV Bharat / state

కోడిపందెం స్థావరంపై పోలీసుల దాడి.. 11 మంది అరెస్టు

author img

By

Published : May 23, 2021, 7:38 PM IST

కోడిపందెం నిర్వహిస్తున్న స్థావరంపై పోలీసులు దాడి చేశారు. కోళ్లు, నగదును స్వాధీనం చేసుకున్నారు. 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన కడప జిల్లా రాజంపేట మండలం హత్యరాల ప్రాంతంలో జరిగింది.

కోడిపందెం స్థావరంపై పోలీసుల దాడి
కోడిపందెం స్థావరంపై పోలీసుల దాడి

రాజంపేట మండలం హత్యరాల ప్రాంతంలో కోడిపందెం ఆడుతున్నట్లు అందిన సమాచారం మేరకు మన్నూరు సీఐ నరేందర్ రెడ్డి, ఎస్ఐ షేక్ రోషన్ తమ సిబ్బందితో వెళ్లి దాడి చేశారని... డీఎస్పీ శివభాస్కర్ రెడ్డి తెలిపారు. 10 పందెం కోళ్లు, 50 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వీరంతా రాజంపేట, నందలూరు, పుల్లంపేట మండలాలకు చెందినవారని వివరించారు. తమిళనాడు రాష్ట్రం సేలం ప్రాంతం నుంచి పందెం కోళ్లను కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారని డీఎస్పీ వివరించారు.

ఇదీ చదవండీ... 'ఆనందయ్యది ఆయుర్వేదం కాదు..నాటు మందు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.