కంటైనర్‌లో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 29 ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లా రాజంపేట అటవీ రేంజ్ పరిధిలోని పుల్లంగేరు వద్ద ఎర్రచందనం దుంగల కంటైనర్‌ను పట్టుకుని సీజ్ చేసినట్లు డీఎఫ్‌వో నరసింహారావు తెలిపారు. 29 ఎర్రచందనం దుంగల బరువు 899 కిలోలని ఆయన తెలిపారు. ఈ వాహనం కర్ణాటక ప్రాంతం నుంచి అనంతపురం, కడప మీదుగా తమిళనాడు లోని కోయంబత్తూర్‌కు వెళ్తున్నట్లు విచారణలో తెలిసిందన్నారు. దీని వెనుక తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు ఉన్నారనే అనుమానం ఉందని, వారికి స్థానిక స్మగ్లర్లు ఎవరైనా సహకరిస్తున్నారనే కోణంలో విచారణ చేపట్టామని అన్నారు.
ఇదీ చదవండి: గువ్వలచెరువు ఘాట్‌రోడ్ వద్ద ప్రమాదం.. ఒకరు మృతి