కడప జిల్లా పొద్దుటూరులోని ఓ స్థలం విషయంలో శివ గణేశ్, తన కుమారుడు కొండారెడ్డి మధ్య వివాదం ఉన్న మాట వాస్తవమేనని మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అన్నారు. ఈ మేరకు హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కుమారుని మీద కేసు నమోదుపై స్పందించారు.
ఇద్దరూ కలిసి కొన్ని ఏళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారన్నారు. పొద్దుటూరులోని తమకు రావాల్సిన భూమి ఇవ్వకుండా శివ గణేశ్ ఇబ్బంది పెట్టేవాడిని ఎమ్మెల్యే మీడియా సమావేశంలో ఆరోపించారు. శివ గణేశ్‌ను కత్తులు, తుపాకులతో బెదిరించాల్సిన అవసరం తన కుమారునికి లేదని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి: