ETV Bharat / state

పీఎం స్వనిధి.. చిరువ్యాపారుల పెన్నిధి

author img

By

Published : Jul 2, 2020, 10:14 AM IST

పట్టణాల్లోని చిరువ్యాపారులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థికంగా కుదేలైన వారిలో పునరుత్తేజం నింపేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగానే ప్రధాన మంత్రి స్ట్రీట్‌ వెండర్స్‌ ఆత్మనిర్భర్‌ నిధి (పీఎం స్వనిధి) పథకం ద్వారా వారికి 7 శాతం వడ్డీ రాయితీతో రూ.10 వేల రుణాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంది.

pm swanidhi scheme for street vendors
చిరు వ్యాపారుల కోసం పీఎం స్వనిధి పథకం

కరోనా వ్యాప్తి నివారణ కోసం చేపట్టిన లాక్‌డౌన్‌ అన్నివర్గాల మీద తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటికీ చాలామంది కోలుకోలేని పరిస్థితి నెలకొంది. అలాంటి వారిలో చిరువ్యాపారులు ముందు వరుసలో ఉంటారు.వారంతా ప్రతి రోజూ వ్యాపారం చేస్తే కానీ బతుకు బండి ముందుకు సాగని దుస్థితి. అలాంటి వారిని ఆదుకునేందుకు కేంద్రప్రభుత్వం ముందుకువచ్చింది. పీఎం స్వనిధి పేరుతో 7 శాతం వడ్డీతో రూ. 10 వేల రుణం అందించేందుకు సిద్ధమైంది.

ఎవరు అర్హులు?

కడప జిల్లాలో చిరువ్యాపారులు వేల సంఖ్యలో ఉన్నారు. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది మార్చి 24 కంటే ముందునుంచే వ్యాపారం జరుపుతున్న చిరు వ్యాపారులంతా పీఎం స్వనిధి పథకానికి అర్హులని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా గుర్తింపు పత్రాలు పొందిన 4,298 మంది చిరువ్యాపారులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికీ ఎవరైనా అర్హులై ఉండి గుర్తింపు పత్రాలు పొందకపోయినా వడ్డీ రాయితీతో రుణాన్ని పొందేందుకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అర్హులందరికీ వ్యాపారాలు నిర్వహించుకునేందుకు వీలుగా రుణాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించి, ఆ దిశగా ఏర్పాట్లు చేసింది. జిల్లావ్యాప్తంగా గుర్తించిన చిరు వ్యాపారులకు రుణాలు ఇప్పించేందుకు ఇప్పటికే సంఘాలు ఏర్పాటు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ లబ్ధి వేరుగా..

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా జగనన్నతోడు పథకం ద్వారా చిరు వ్యాపారులకు బ్యాంకుల నుంచి సున్నా వడ్డీ రుణాలు ఇప్పించేందుకు నిర్ణయించింది. పట్టణాలతోపాటుగా గ్రామీణ ప్రాంతాలకు దీన్ని విస్తరించారు. పీఎం స్వనిధితో సంబంధం లేకుండా ఈ పథకాన్ని అమలుపరచనున్నట్లు అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకంతో లబ్ధి పొందేవారికి జగనన్నతోడు ద్వారా సగం వడ్డీ రాయితీ మాత్రమే అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే గ్రామ, వార్డు వాలంటీర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను గుర్తిస్తున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి

'జిల్లాలోని 4,298 మంది చిరువ్యాపారులకు పీఎం స్వనిధి పథకం ద్వారా వడ్డీ రాయితీతో రుణాలు ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. పట్టణాల్లోని చిరువ్యాపారులకు ఇదొక మంచి అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోయి ఉంటే జిల్లా సచివాలయంలో ఉన్న మెప్మా కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వారికీ లబ్ధి చేకూర్చేందుకు కృషి చేస్తాం'. - రామ్మోహన్‌రెడ్డి, పథక సంచాలకుడు, మెప్మా

ఇవీ చదవండి...

కరోనా ఎఫెక్ట్: ప్రొద్దుటూరులో అమానవీయ సంఘటన

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.