కడప జిల్లాలోని సుండుపల్లి మండలంలో గత ఏడాది వరద ఉద్ధృతికి తెగిన వై.ఆదినారాయణరెడ్డి పింఛ జలాశయం పునరుద్ధరణకు రూ.5.90 కోట్లతో చిన్ననీటి పారుదలశాఖ రాష్ట్ర అధికారులకు ప్రతిపాదనలు పంపామని ఈఈ వెంకట్రామయ్య తెలిపారు. ఆమోదం లభిస్తే కుడి భాగంలో మట్టికట్ట స్థానంలో ప్రస్తుతం నిర్మించిన రింగ్‌బండ్‌లో కుడి కాలువ తూము ఏర్పాటు, 400 మీటర్లు మోల్డింగ్ పద్ధతిలో కాలువ నిర్మాణం, రింగ్‌బండ్‌ను ట్యాంక్‌బండ్ స్థాయికి అభివృద్ధి చేసి పూర్వ స్థాయిలో నీటి నిలువ చేసేందుకు పనులు చేపడతామని చెప్పారు.
పింఛ జలాశయం సామర్థ్యాన్ని 1.5 టీఎంసీలకు పెంచాలన్న ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి విన్నపం మేరకు ముఖ్యమంత్రి పరిశీలించి.. ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సమగ్ర పరిశీలన, అధ్యయనం, తుది నివేదిక రూపకల్పన పనులకు రూ.41 లక్షల అంచనాతో ప్రతిపాదనలు పంపామని ఈఈ వెంకట్రామయ్య తెలిపారు.
ఇదీ చదవండి:
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు, లోకేశ్‌పై కేసులు: యనమల