రానున్న నెల రోజుల వ్యవధిలో ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో జిల్లా వ్యాప్తంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని కడప జడ్పీ సీఈవో నాగేష్ స్పష్టంచేశారు. కడపలో 'ఈనాడు -ఈటీవీ భారత్' ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి ఫోన్ కాల్స్ రాగా ప్రజలు అడిగిన ప్రశ్నలకు జడ్పీ సీఈవో నాగేష్, ఆర్.డబ్ల్యు.ఎస్ అధికారి, జిల్లా పంచాయతీ శాఖ అధికారులు సమాధానాలు ఇచ్చారు. సమస్యలన్నింటినీ 2 రోజుల్లో పరిష్కరిస్తామని జడ్పీ సీఈవో హామీ ఇచ్చారు. తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని, నీటి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయనున్నట్లు జడ్పీ సీఈవో తెలిపారు.
ఇదీ చదవండి