కడప జిల్లా పెద్దముడియం మండలం గుండ్లకుంటలో విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చదివిరాళ్ల దిన్నెవద్ద లారీలో చొప్పదండు వేసుకుని ఇద్దరు వ్యక్తులు ప్రయాణమయ్యారు.
గుండ్లకుంట వద్దకు రాగానే తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలు లారీకి తగిలాయి. ఈ విషయం డ్రైవర్ గమనించలేదు. లారీ క్యాబిన్లో ఉన్న అశోక్‌ను తీగలు తప్పించమని డ్రైవర్ చెప్పాడు. దీంతో అతను దిగుతున్న సమయంలో కరెంట్ షాక్ కొట్టి మృతిచెందాడు. మృతుడిది కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకుంట గ్రామంగా గుర్తించారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి...