ETV Bharat / state

RAINS: కడప జిల్లాలో జోరు వానలు...ప్రజలకు తప్పని అవస్థలు - కడప జిల్లా ముఖ్యంశాలు

కడప జిల్లా కమలాపురం క్రాస్ వద్ద పైడిమాన్ కాలనీ వాసులు చిన్న వర్షానికే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వానాకాలం వస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించాల్సిందేనని వాపోతున్నారు.

కాలనీ
కాలనీ
author img

By

Published : Nov 13, 2021, 4:42 PM IST

కడప జిల్లాలో జోరు వానలు

చిన్న వర్షానికే నీరు చేరి కడప జిల్లా కమలాపురం క్రాస్‌ వద్ద ఉన్న పైడిమాన్ కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 10 ఏళ్లకుపైగా 20 కుటుంబాలు ఇక్కడ గుడిసెలు వేసుకుని జీవిస్తున్నాయి. వానాకాలమొస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించాల్సిందేనని వాపోతున్నారు.

రాయచోటి నియోజవర్గంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న పంటలను ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి శనివారం పరిశీలించారు. రామాపురం మండలం సుద్ధమల్ల గ్రామంలో నీట మునిగిన వరి పంటను పరిశీలించారు. కోత దశలో వర్షపు నీటిలో మునిగిపోయి పంట నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు ఆయనను కోరారు.

చెన్నముక్కపల్లి గ్రామంలో నీట మునిగిన వేరుశనగ, వరి, కూరగాయల పంటలను ఆయన పరిశీలించారు నియోజకవర్గంలో వర్షానికి భారీగా పంట నష్టం జరిగిందని.. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్, నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తం కావడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూశారని అధికారులను అభినందించారు.

కడపలో ఉదయం నుంచి వర్షం తగ్గినప్పటికీ గత రెండు రోజుల నుంచి కురిసిన భారీ వర్షానికి రోడ్లపై ఇంకా వర్షపు నీరు నిలిచే ఉంది. ప్రజలకు సమస్యలు తప్పడం లేదు. కడప శివారులోని పాత బైపాస్ రోడ్డు మొత్తం వర్షపునీటితో నిండిపోయింది. డివైడర్ పైనుంచి వర్షపునీరు ప్రవహిస్తోంది. దీంతో రోడ్డు పక్కన ఉన్న పలు షోరూంలు, మెకానిక్ షెడ్లు, హోటల్స్, దుకాణాలు, స్థానికంగా ఉన్న ఎస్సార్ నగర్, సాయి బాబా నగర్ నివాసాల్లోకి మోకాలు లోతు వరకు వర్షపు నీరు చేరింది. అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో స్థానికులే డివైడర్​ను పగలగొట్టారు.

వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో.. ప్రజలు టెన్షన్​లో ఉన్నారు.

ఇదీ చదవండి:

'ఇప్పటికైనా ఆప్షన్ల నాటకాన్ని జగన్‌ మానుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.