డ్రిప్ ఇరిగేషన్ పేరిట కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడుతున్నారని కడప జిల్లాకు చెందిన విజయలక్ష్మి ఆరోపించారు. కడప ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడిన ఆమె.. తన పేరిట ముద్దనూరు మండలంలో 82 సెంట్ల స్థలం ఉందని తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్‌కు సంబంధించిన కొంతమంది డీలర్లు తనకు మరో 9 ఎకరాలు ఉన్నట్లు పత్రాలు సృష్టించి...ఇరిగేషన్ సామాగ్రిని కొనుగోలు చేసి సబ్సిడీ పొందారని ఆమె ఆరోపించారు. జిల్లాలో ముద్దనూరు, తొండూరు, కొండాపురం తదితర ప్రాంతాలలో 150 మంది పేర్లపై నకిలి పత్రాలు సృష్టించి మోసం చేశారని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ సొమ్మును ఇలా దుర్వినియోగం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: కడపలో 6 అక్రమ ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం