కడప జిల్లా బద్వేలు మున్సిపల్ కార్యాలయంలో చనిపోయిన వారి పేర పింఛన్ సొమ్ము స్వాహా చేసిన ఘటనలో అధికారుల విచారణ పూర్తైంది. వ్యవహారాన్ని ఈనాడు, ఈటీవీ భారత్ వెలుగులోకి తీసుకువచ్చింది. అధికారుల విచారణలో ఆసక్తి కరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కార్యాలయంలో పనిచేసే పొరుగుసేవల సిబ్బంది విజయ్.. ఏడాదిన్నర కాలంగా సుమారు 2 లక్షల 20వేల రూపాయలను స్వాహా చేసినట్టు విచారణలో తేలింది. అతణ్ణి విధుల నుంచి తప్పిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి.