PCC Media Chairman Tulsi Reddy: మకర సంక్రాంతి సందర్భంగా వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లిలో పీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి కుటుంబసభ్యులతోపాటుగా, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి గాలి పటాలు ఎగరవేశారు. తెలుగు ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగలు మానవ జీవితంలో అంతర్భాగమని ఆయన అన్నారు. మనుషుల మధ్య ప్రేమలు అనుబంధాలు, ఆప్యాయతలు పెంచడంలో పండుగలు ప్రముఖ పాత్ర వహిస్తాయని తులసిరెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి పండుగలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతి బింబాలని తులసి రెడ్డి వెల్లడించారు. మకర సంక్రాంతి తెలుగు వారికి పెద్ద పండుగ అని వెల్లడించారు.. ప్రకృతికి, మనిషికి మధ్య ఉండే అనుబంధాన్ని వ్యక్తీకరించేదే సంక్రాంతి పండుగని తులసిరెడ్డి తెలిపారు. ఈ సంక్రాంతి పండగను తెలుగు ప్రజలంతా ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఇవీ చదవండి: