కడప జిల్లాలోని సోమశిల ముంపు ప్రభావిత అట్లూరు మండలం వరికుంట పంచాయతీ సర్పంచి స్థానాన్ని శుక్రవారం బొమ్మాబొరుసు ద్వారా స్థానిక నాయకులు ఖరారు చేశారు. ఈ స్థానం ఎస్సీ జనరల్‌కు కేటాయించగా.. ఒకే పార్టీలోని రెండు వర్గాల మధ్య పోటీ నెలకొంది. ఇరువర్గాల ఏకాభిప్రాయంతో బొమ్మా బొరుసు పద్ధతిని ఎంచుకున్నారు. ఇందులో గెలిచిన వారు ముందు రెండేళ్లు లేదా ఆ తరువాత మూడేళ్ల పదవీ కాలన్నీ ఎంచుకునేందుకు అంగీకరించారు. నలుగురు అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. అందులో ఇద్దరు డమ్మీలు. టాస్‌లో గెలిచిన విజేత.. తొలి రెండేళ్ల పదవీకాలానికి మొగ్గుచూపారు. పోలింగ్ యథావిధిగానే జరుగుతుందని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: ఊరించినదొకరిని.. వరించినదొకరిని!