ETV Bharat / state

చదువుకు.. పేదరికం అడ్డు కాకూడదనేదే ప్రభుత్వ లక్ష్యం: డిప్యూటీ సీఎం అంజాద్ - Amma odi Latest News

రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని డిప్యూటీ సీఎం అంజాద్ భాషా చెప్పారు. తాడేపల్లిలోని సీఎం జగన్ తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన జగనన్న విద్యాదీవెన నిధుల జమ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

పేదరికం అడ్డు కాకూడదనేదే మా లక్ష్యం : డిప్యూటీ సీఎం అంజాద్

author img

By

Published : Apr 20, 2021, 11:17 AM IST

విద్యకు పేదరికం ఏ మాత్రం అడ్డు కాకూడదన్నదే.. ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా తెలిపారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. జగనన్న విద్యా దీవెన కార్యక్రమం నిర్వహించగా.. ఉప ముఖ్యమంత్రి అంజాద్​తో పాటు జేసీలు గౌతమి (రెవెన్యూ), ధర్మ చంద్రారెడ్డి (సంక్షేమం) హాజరయ్యారు. హాజరయ్యారు. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనే జమ చేశారు.

మెగా చెక్కు రూపంలో..

పేదరికం అడ్డు కాకూడదనేదే మా లక్ష్యం : డిప్యూటీ సీఎం అంజాద్
పేదరికం అడ్డు కాకూడదనేదే మా లక్ష్యం : డిప్యూటీ సీఎం అంజాద్

2020-21 విద్యా సంవత్సరానికి మొదటి విడతగా జిల్లాలోని 72 వేల 39 మంది విద్యార్థులకు మంజూరైన " జగనన్న విద్యా దీవెన " మొత్తాన్ని రూ. 45 కోట్ల 63 లక్షల 38 వేల 505లను మెగా చెక్కు రూపంలో.. అంజాద్ బాషాతో కలిసి జేసీలు ఎం.గౌతమి, ధర్మ చంద్రా రెడ్డి, విద్యార్థుల తల్లులకు అందజేశారు.

విద్యతోనే..

విద్యతోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని నమ్మిన సీఎం జగన్.. విద్యార్థుల సంక్షేమం కోసం ఎన్నో రకాల పథకాలకు శ్రీకారం చుట్టారని కార్యక్రమానికి హాజరైన వారితో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పేర్కొన్నారు. పేద విద్యార్థుల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న గోరుముద్ద, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా కానుక వంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని చెప్పారు.

ఇవీ చూడండి:

కొవిడ్ నియంత్రణకు మాస్కు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.