ETV Bharat / state

శవాగారంలో అనాథ మృతదేహాలు.. ఆరా తీస్తున్న పోలీసులు

ఎక్కడ పుట్టారో.. ఎక్కడ పెరిగారో. కడప జిల్లాలో వేరు వేరు సంఘటనలో ప్రాణాలు వదిలారు. యోగక్షేమాలు కనుక్కుని, ఏమయ్యారో తెలుసుకునేందుకు ఎవరూ రావటం లేదు. వారి మృతదేహాలను అధికారులు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని శవాగారంలో భద్రపరిచారు.

Orphaned dead bodys in the Mortuary
శవాగారంలో అనాధ మృతదేహాలు
author img

By

Published : Nov 23, 2020, 12:39 PM IST

కడప ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని శవాగారంలో నాలుగు గుర్తు తెలియని మృతదేహాలను అధికారులు భద్రపరిచారు. వారికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేని కారణంగా.. పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. నలుగురు వ్యక్తులు జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో సంచరిస్తూ.. వివిధ కారణాలతో ప్రాణాలు వదిలారు. వీరికి సంబంధించిన సమాచారం లభ్యం కావడం లేదని చెప్పారు.

మృతుల వయసు 60 సంవత్సరాలు పైబడి ఉంటుందని తెలిపారు. వీరు మృతి చెంది రోజులు గడుస్తున్నా ఎవరూ రాని కారణంగా.. మృతదేహాలను పోలీసులు శవాగారంలో భద్రపరిచారు. వివరాలు తెలుసుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. సంబంధికులు ఎవరైనా ఉంటే కడప రిమ్స్ పోలీసులను సంప్రదించాలని సీఐ సత్య బాబు తెలిపారు.

ఇవీ చూడండి:

అత్తింటి నుంచి అదృశ్యం... పక్క రాష్ట్రంలో ఉద్యోగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.