ETV Bharat / state

'బ్యాంక్ అకౌంట్ మనదే' - కానీ ట్రాన్సాక్షన్స్ వాళ్లవి - ILLEGAL PAYMENT GATEWAY SCAM

కమీషన్ల ఆశ చూపి బ్యాంకు ఖాతాలు అద్దెకు - చట్టవిరుద్ధమైన పేమెంట్‌ గేట్‌వేల ద్వారా విదేశాలకు సొమ్ము తరలింపు

Illegal Payment Gateway Scam
Illegal Payment Gateway Scam (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 5, 2024, 10:35 AM IST

Illegal Payment Gateway Scam in AP : కమీషన్ల ఆశ చూపి బ్యాంకు ఖాతాలు అద్దెకు తీసుకుంటారు. అప్పటి నుంచి ఆ ఖాతాను విదేశాల నుంచే నిర్వహిస్తారు. ఆ తర్వాత సైబర్‌ నేరాల్లో కొల్లగొట్టిన సొత్తు వాటిల్లో జమ చేస్తారు. ఇలా మోసాలకు పాల్పడుతున్న గుట్టును విశాఖ పోలీసులు రట్టు చేశారు. విశాఖపట్నానికి చెందిన సూర్యమోహన్‌ చైనాలో కారు డ్రైవర్‌గా పనిచేసే సమయంలో అక్కడి సైబర్‌ నేరగాళ్ల ముఠాలతో పరిచయాలు ఏర్పడ్డాయి.

భారత్‌కు తిరిగి వచ్చేసిన సూర్యమోహన్‌ స్థానికంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారిని గుర్తించి వలవిసిరేవాడు. మీ బ్యాంకు ఖాతాను అద్దెకు ఇవ్వాలని చెప్పేవాడు. అందులో నిత్యం రూ.కోట్లల్లో సొమ్ము జమ అవుతుందని అందుకు ప్రతిగా వారు భారీగా కమీషన్‌ చెల్లిస్తారంటూ ఎరవేసేవాడు. దీంతో అదే నగరానికి చెందిన సాయిరామ్‌తో పాటు మరికొంతమంది సూర్యమోహన్‌ చెప్పిన టెలిగ్రామ్‌ యాప్‌లోని గ్రూపుల్లో వారి బ్యాంకు ఖాతా వివరాలు పోస్ట్ చేసేవారు.

Mule Accounts Scam in AP : ఆయా బ్యాంకు ఖాతాల్లో తరచూ భారీ మొత్తాల్లో సొమ్ములు జమయ్యేవి. ఆ తర్వాత కొద్ది నిమిషాల వ్యవధిలోనే అవి అంచెలంచెలుగా వివిధ ఖాతాల్లోకి మళ్లిపోయేవి. ఇలా చివరికి చట్టవిరుద్ధ పేమెంట్‌ గేట్‌వేల ద్వారా విదేశాల్లోని ఖాతాల్లోకి వెళ్లిపోయేవి. కేవలం రెండు ఖాతాల ద్వారా నాలుగు నెలల వ్యవధిలో రూ.8 కోట్లు ఇలా తరలిపోయాయి. విశాఖలో ఈ కేసు తీగ లాగితే దేశమంతటా విస్తరించి ఉన్న ఈ ముఠా డొంక కదిలింది.

తైవాన్, చైనా సహా పలు దేశాల నుంచి సైబర్‌ నేరాలకు పాల్పడుతూ ఆ కొల్లగొట్టిన సొత్తును మన దేశంలోని కొంతమంది ఖాతాల్లోకి మళ్లిస్తున్న దందా వెలుగులోకి వచ్చింది. కమీషన్లు చెల్లిస్తామంటూ ఆశచూపించి వ్యక్తిగత, వివిధ డొల్ల కంపెనీలు, ఇతర సంస్థలకు చెందిన బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకుని వారి అక్రమ లావాదేవీలకు వినియోగిస్తున్నట్లు తేలింది. పెద్ద ఎత్తున మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. ఇదే తరహాలో గుజరాత్‌లోనూ ఓ ఘటన జరగడంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు, గుజరాత్‌ పోలీసులు సంయుక్తంగా దేశమంతటా ఆపరేషన్లు చేపట్టి ఈ సరికొత్త మోసాన్ని ఛేదించారు. దీని వెనుక విదేశీ వ్యవస్థీకృత ముఠాలు ఉన్నట్లు ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ (ఐ4సీ) తాజాగా గుర్తించింది.

సోషల్ మీడియా ద్వారా ఎరవేసి :

  • సైబర్‌ నేరస్థులు వివిధ రకాల బెట్టింగ్‌ యాప్‌లు, ఇతరత్రా టాస్క్‌గేమ్‌ల పేరిట పలువుర్ని ఉచ్చులోకి లాగుతున్నారు. ప్రధానంగా సోషల్ మీడియా ద్వారా వారిని ఆకర్షిస్తూ వారి బ్యాంకుఖాతాల వివరాల్ని తీసుకుంటున్నారు.
  • విదేశాల్లో మకాం వేసిన సైబర్‌ నేరస్థులు ఈ ఖాతాలను వారి నియంత్రణలోనే పెట్టుకుని నిర్వహిస్తుంటారు. దీని కోసం స్థానికంగా కాల్‌సెంటర్‌లను ఏర్పాటు చేస్తారు. వీటిని ఉపయోగించుకుని చట్టవిరుద్ధమైన పేమెంట్‌ గేట్‌వేలు సృష్టిస్తారు.
  • మోసపూరిత పెట్టుబడి సైట్లు, గ్యాంబ్లింగ్‌ వెబ్‌సైట్లు, ఆఫ్‌షోర్‌ బెట్టింగ్, మోసపూరిత ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌లతో పాటు వివిధ రకాల సైబర్‌ నేరాలకు పాల్పడటం ద్వారా కొల్లగొట్టిన సొత్తును ఆయా ఖాతాల్లోకి మళ్లిస్తారు. నిమిషాల వ్యవధిలో ఒక ఖాతా నుంచి మరో ఖాతాలోకి ఆ ఖాతాలో నుంచి ఇంకో ఖాతాలోకి మళ్లించేస్తారు.
  • ఆర్‌టీఎక్స్‌ పే, పొక్కోపే, పీస్‌పే, ఆర్‌పీ పే వంటి చట్టవిరుద్ధమైన పేమెంట్‌ గేట్‌ వేల ద్వారా మొత్తం సొత్తును విదేశాలకు పంపించేస్తారు.
  • ఇలా దేశవ్యాప్తంగా రోజూ కోట్ల రూపాయల సొత్తు ఇలా మనీలాండరింగ్‌ ద్వారా మళ్లిపోతోంది.

కమీషన్లకు కక్కుర్తి పడితే కేసుల్లో ఇరుక్కోవడమే :

  • కమీషన్‌కు ఆశపడి తమ బ్యాంకు ఖాతాలను సైబర్‌ నేరస్థులకు అప్పగించే వారిని పోలీసు పరిభాషలో ‘మ్యూల్స్‌’గా పరిగణిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యూల్స్‌గా మారి కేసుల్లో ఇరుక్కోవద్దని ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ (ఐ4సీ) సూచిస్తోంది.
  • బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేస్తామని, ప్రతిగా కమీషన్‌ ఇస్తామంటూ ఎవరైనా చెబితే నమ్మవద్దు. వెంటనే వారిపై ఫిర్యాదు చేయండి.
  • ఎలాంటి పరిస్థితుల్లోనూ మీ బ్యాంకు ఖాతా, కంపెనీ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లు వంటివి వేరేవారి అవసరాల కోసం వినియోగించేందుకు ఇవ్వొద్దు.
  • సైబర్‌ నేరాలకు సంబంధించిన అక్రమ సొత్తు ఒక్కసారి మీ బ్యాంకు ఖాతాలో జమయితే చట్టపరంగా అనేక పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అరెస్ట్​కి అవకాశం ఉంటుంది.

ఫిర్యాదు చేయండిలా! :

  • ఎవరైనా మిమ్మల్ని బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాలని ప్రలోభ పెడితే ఈ మార్గాల్లో ఫిర్యాదు చేయవచ్చు.
  • 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.
  • https://cybercrime.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చు.
  • స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వొచ్చు.

చైనాతో లింకులు - విశాఖలో బెట్టింగ్ యాప్ ముఠా అరెస్ట్

మీకూ ఇలాంటి ​కాల్ వచ్చిందా? - ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.