కడప జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 105 మంది చిన్నారులకు విముక్తి కల్పించినట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. ముఖ్యమంత్రి, డీజీపీ సవాంగ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. విడిపించిన వారిలో 85 మందిని వారి తల్లిదండ్రులకు అప్పగించామని.. 20 మందిని చైల్డ్ వెల్ఫేర్ సెంటర్కు తరలించామని తెలిపారు.
ఆపరేషన్ ముస్కాన్ ప్రతి సంవత్సరం జరుగుతుందని ఎస్పీ చెప్పారు. చిన్నపిల్లలను కార్మికులుగా చేయడం చట్టరీత్యా నేరమన్నారు. లాక్ డౌన్ సమయంలో పనులు దొరకని కారణంగా చిన్నపిల్లలతో పనులు చేయించే అవకాశం ఉందన్నారు. జులై 14న ప్రారంభమైన ఈ కార్యక్రమం వారంరోజులపాటు జరుగుతుందన్నారు. దీనికోసం జిల్లావ్యాప్తంగా ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటుచేశామని తెలిపారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ఫుట్పాత్లు, హోటళ్లు, ఆటో గ్యారేజీలలో బాలకార్మికులుగా పనిచేస్తున్న అనాథ బాలల కోసం తనిఖీలు చేపడుతున్నామని వివరించారు.
ఇవీ చదవండి...
శేషాచల అడవుల్లో స్మగ్లింగ్..రూ.27 లక్షల విలువైన ఎర్ర చందనం సీజ్