కడప జిల్లా కొండాపురం మండలం తాళ్ల పొద్దుటూరు గ్రామంలో మూడోరోజు ఆందోళన కొనసాగుతోంది. గాలేరు నగరి కాలువ నుంచి గండికోట జలాశయానికి నీటి విడుదల చేశారు.ఆ గ్రామంలో నీటి మట్టం రోజురోజుకు పెరిగిపోతుండటం వల్ల గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. బీసీ, ఎస్సీ కాలనీలో ఇళ్ల వద్దకు కృష్ణా జలాలు చేరుతున్నాయి. శనివారం సాయంత్రం జిల్లా సంయుక్త కలెక్టర్ గౌతమి... పునరావాస కాలనీల్లో వెళ్లి మౌలిక సదుపాయాలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు తాళ్ల పొద్దుటూరు చేరుకుని నిర్వాసితులకు మద్దతు తెలిపారు.
ఇదీ చూడండి. నేల తల్లి పాన్పుగా పసికందు..