కడప జిల్లా బ్రహ్మంసాగర్ జలాశయం ప్రధాన కట్టకు లీకేజీ కొనసాగుతూనే ఉంది . భారీ వర్షాలు, వరదల కారణంగా శ్రీశైలం జలాశయం నుంచి బ్రహ్మంసాగర్ రిజర్వాయర్లోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది . దీంతో రోజురోజుకు నీటి మట్టం గరిష్ఠస్థాయికి పెరుగుతుంది. జలాశయం పూర్తి నీటి మట్టం సామర్థ్యం 17 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 12 టీఎంసీలకు చేరుకొంది. ఈ పరిస్థితుల్లో నీటి లీకేజీ అన్ని వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రధాన కట్ట 209 అడుగులు ఎత్తు ఉండగా.. లీకేజీ రెండు వందల ఎనిమిది అడుగుల వద్ద వస్తోంది.
లీకేజీని తెలుగు గంగ ప్రాజెక్టు ఎస్సీ శారద, క్షేత్రస్థాయి ఇంజనీర్లు పరిశీలించి వెళ్లారు. కట్టకు ఎటువంటి ముప్పు లేదని అధికారులు స్పష్టం చేశారు. జలాశయం వద్ద కొంత మంది ఇంజనీర్లను నియమించి లీకేజీ వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు తెలుసుకుంటున్నారు.
ఇదీచదవండి
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఈనెల 23నాటికి తీరం దాటే అవకాశం