కడప జిల్లా రాయచోటి ఏజీ గార్డెన్‌కి చెందిన ఓ వ్యక్తి భార్యతో గొడవపడటంతో.. ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపంతో సమీపంలో ఉన్న గుట్టల్లోకి వెళ్లి అధికంగా మద్యం తాగి మృతి చెందాడు.
ఏజీ గార్డెన్‌కు చెందిన అబ్బవరం రాంబాబు ఐదు రోజుల క్రితం గ్రామ సమీపంలో ఉన్న గట్టుల్లోకి వెళ్లిపోయి అతిగా మద్యం తాగాడు. దీంతో మంచినీరు, ఆహారం లేక మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం కుల్లిపోవటంతో సంఘటన స్థలంలోనే శవపరీక్ష నిర్వహించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ రాజు తెలిపారు.
ఇదీ చదవండి: విషాదం.. కరెంటు షాక్‌తో యువకుడు మృతి