కడప జిల్లా రాజంపేటలో విజిలెన్స్ ఎన్ఫోఫోర్స్మెట్ , లీగల్ మెట్రాలజీ అధికారులు పలు దుకాణాలపై సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. దుకాణాలను పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. జిల్లాలో కడప పొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేల్, రైల్వేకోడూరు, రాజంపేట వంటి పట్టణాలలో దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 24 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా సరకులను విక్రయిస్తే కఠిన చర్యలు చేపడుతామని అధికారులు వ్యాపారులను హెచ్చరించారు.
ఇవీ చదవండి: ఆర్ఎంపీ వైద్యం...బాలింత మృతి