కడపలోని దుకాణాలు,షాపింగ్ మాల్స్ పై తూనికల కొలతల అధికారులు తనీఖీలు నిర్వహించారు. ముద్రించిన ధరలు కంటే అధికంగా విక్రయిస్తున్న 6 దుకాణాలపై కేసులు నమోదు చేశారు అధికార్లు. స్పెన్సర్ లో ఎమ్మార్పీ ధరలు లేని వస్తువులను గుర్తించారు. ప్రతి ఒక వస్తువుపై ధర, తయారైన తేదీ, కాలపరిమితి, బరువు, తయారు చేసిన కంపెనీ చిరునామా, చరవాణి నెంబర్ సమాచారం తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. సూచించారు. నిబంధనలకు విరుద్దంగా ఉన్న వారిపై కేసు నమోదు చేసి, జరిమానా విధిస్తామని తూనికల కొలతల డిప్యూటీ కంట్రోలర్ ఏకాంబరం అన్నారు.
ఇదీచూడండి.శ్రీకాకుళం బాలిక...10 నిమిషాల్లో జవాబిచ్చింది..ప్రధానిని కలవనుంది!