కడప జిల్లాలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలో బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే ప్రొద్దుటూరులో మాత్రం బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. కంటైన్మెంట్ జోన్ అయినందున అక్కడ బస్సులు నడిపేందుకు అధికారులు అనుమతి ఇవ్వలేదు.
ఇతర డిపోలకు చెందిన వాటిని పట్టణంలోకి రానివ్వడం లేదు. ప్రొద్దుటూరు బైపాస్ రహదారి మీదుగా ఇతర బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. అనుమతి రాగానే బస్సు సర్వీసులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని పొద్దుటూరు డిపో మేనేజర్ తెలిపారు.
ఇవీ చదవండి.. విజయనగరం నుంచి.. రోడ్డెక్కిన బస్సులు