ETV Bharat / state

జనవరి 31న అకారణంగా రోడ్ల పైకి వస్తే కఠిన చర్యలు: కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి - ap latest news

కడప జిల్లాలో నూతన సంవత్సర వేడుకలను రద్దు చేస్తున్నట్లు.. డీఎస్పీ వెంకటశివారెడ్డి వెల్లడించారు. కరోనా మూడో విడత విస్తరిస్తున్న కారణంగా.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అకారణంగా ఎవరైనా 31వ రోజు రాత్రి రోడ్లపైకి వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.

new year celebrations cancelled in kadapa says dsp venkatashivareddy
కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి
author img

By

Published : Dec 28, 2021, 3:48 PM IST

కరోనా మూడో విడత విస్తరిస్తున్న కారణంగా.. నూతన సంవత్సర వేడుకలను రద్దు చేస్తున్నట్లు.. డీఎస్పీ వెంకటశివారెడ్డి వెల్లడించారు. 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ప్రధాన రహదారులన్నింటినీ మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. యువత అకారణంగా ద్విచక్ర వాహనాలపై రోడ్లపైకి వస్తే.. కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. జనవరి 31న.. రాత్రి 20 ప్రత్యేక పోలీసు బృందాలు నగరం మొత్తం నిఘా చెప్పట్టనున్నట్లు తెలిపారు. శ్వాస విశ్లేషణ పరికరం, స్పీడ్ లేజర్ గన్ తో తనిఖీలు చేస్తామని పేర్కొన్నారు. ఎవరైనా అత్యవసరంగా ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తే.. వారికి మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చి మద్యం తాగి లేనిపోని సమస్యలు సృష్టిస్తే.. వారిపై కేసులు నమోదు చేసి.. లైసెన్సులు రద్దు చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు.

ఇదీ చదవండి: Cinema Tickets Issue: లైసెన్స్ లేకనే థియేటర్లు మూసేశారు.. స్వచ్ఛందం కాదు: మంత్రి పేర్ని నాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.