కడపలోని 30వ ఎన్సీసీ బెటాలియన్‌ను ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ టీఎస్ఎస్ కృష్ణన్ సందర్శించారు. బెటాలియన్‌లో ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను క్యాడేట్స్ ను అడిగి తెలుసుకున్నారు. రానున్న గణతంత్ర దినోత్సవంలో రాష్ట్రం నుంచి ఎక్కువ మంది ఎన్సీసీ క్యాడేట్లను పాల్గొనేలా శిక్షణ ఇస్తున్నామని ఆయన అన్నారు.
కడప ఎన్సీసీ బెటాలియన్‌ను సందర్శించడం సంతోషంగా భావిస్తున్నానని తెలిపారు. అలాగే అక్కడ ఎన్సీసీ క్యాడేట్లకు ఇస్తున్న శిక్షణ అభినందనీయం అన్నారు. రాష్ట్రం నుంచి 26 మంది ఎన్సీసీ క్యాడేట్లను ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పెరేడ్‌కు పంపిస్తున్నామని చెప్పారు.
ఇదీ చదవండీ...కొండవీడు కోట అభివృద్ధికి అటవీశాఖ సమాయత్తం