Nara Lokesh on viveka murder case: బాబాయిని చంపిన అబ్బాయి ఆ రక్తపు మరకల్ని తమకు అంటించాలని చూశాడని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. వివేకా హత్య వైఎస్ ఇంటి గొడ్డలిపోటని సీబీఐ తేల్చినందున జగనాసుర రక్త చరిత్రని ఇప్పుడు సాక్షిలో రాయించాలని ట్వీట్ చేశారు. వివేకా హత్యకు సంబంధించి ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడిన వీడియోలను లోకేశ్ తన ట్విట్టర్‌కు జత చేశారు.
-
అబ్బాయిలు బాబాయ్‌ని వేసేసి మా చేతులకు ఆ రక్తపు మరకలంటించాలని చూశారు. సీబీఐ తేల్చింది ఇది వైఎస్ ఇంటి గొడ్డలిపోటని. ఇప్పుడు రాయించండి సాక్షి ఎడిటర్ గారూ జగనాసుర రక్తచరిత్ర అని..#AbbaiKilledBabai pic.twitter.com/lHJOVV42FW
— Lokesh Nara (@naralokesh) February 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">అబ్బాయిలు బాబాయ్‌ని వేసేసి మా చేతులకు ఆ రక్తపు మరకలంటించాలని చూశారు. సీబీఐ తేల్చింది ఇది వైఎస్ ఇంటి గొడ్డలిపోటని. ఇప్పుడు రాయించండి సాక్షి ఎడిటర్ గారూ జగనాసుర రక్తచరిత్ర అని..#AbbaiKilledBabai pic.twitter.com/lHJOVV42FW
— Lokesh Nara (@naralokesh) February 15, 2022అబ్బాయిలు బాబాయ్‌ని వేసేసి మా చేతులకు ఆ రక్తపు మరకలంటించాలని చూశారు. సీబీఐ తేల్చింది ఇది వైఎస్ ఇంటి గొడ్డలిపోటని. ఇప్పుడు రాయించండి సాక్షి ఎడిటర్ గారూ జగనాసుర రక్తచరిత్ర అని..#AbbaiKilledBabai pic.twitter.com/lHJOVV42FW
— Lokesh Nara (@naralokesh) February 15, 2022
cbi chargesheet in Viveka Murder Case: వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ ఛార్జిషీట్ వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 26న పులివెందుల కోర్టులో దాఖలు చేసిన ఈ ఛార్జిషీట్లో నలుగురు నిందితులను చేర్చింది. ఇందులో ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి పేర్లను చేర్చింది.
ఛార్జిషీట్లో వివేకా హత్య జరిగిన రోజు ఘటనపై సీబీఐ ప్రస్తావించింది. ఆధారాలు లేకుండా చేయడంలో ప్రముఖల పాత్రలపై పలు విషయాలను పేర్కొంది. 'వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు ప్రచారం చేశారు. ప్రచారంలో వైఎస్ అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డిది కీలకపాత్ర. ప్రచార చర్చల్లో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఇందులోనూ మనోహర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి ఉన్నారు. ఎర్ర గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి సూచనల మేరకు బెడ్ రూమ్, బాత్‌రూమ్‌లను పని మనుషులు శుభ్రం చేశారు. శవపరీక్ష నివేదికలో వివేకాకు ఏడుచోట్ల బలమైన గాయాలయ్యాయి. వివేకాను హత్యచేయడానికి నలుగురు ఇంట్లోకి వెళ్లారు. ఇందులో ఎర్ర గంగిరెడ్డి, సునీల్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి ఉన్నారు. వివేకా హత్యకు 2019 ఫిబ్రవరి 10న ఎర్ర గంగిరెడ్డి ఇంట్లో ప్రణాళిక జరిగింది. బెంగళూరులో రూ.8 కోట్ల స్థలం సెటిల్‌మెంట్ విషయమై వివేకా, ఎర్రగంగిరెడ్డి మధ్య విభేదాలు వచ్చాయి. వివేకాను చంపితే సుపారీ ఇస్తారని ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్లు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు. తమ వెనక పెద్దలున్నారని ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్లు దస్తగిరి పేర్కొన్నారు. పెద్దల్లో అవినాష్, భాస్కర్, మనోహార్, శివశంకర్ ఉన్నారని గంగిరెడ్డి చెప్పినట్లు దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో నమోదైంది' అని సీబీఐ ఛార్జిషీట్లో పేర్కొంది.
ఇదీ చదవండి :
YS Viveka Murder Case: వివేకా కేసులో మరో ట్విస్ట్.. సీబీఐపై ఉదయ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు